ములుగు,అర్జున్ సమాచారం:
రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధుల సహకారంతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.
జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు గారు తన ఛాంబర్లో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో రాజకీయ పార్టీలు, ప్రజా ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని కోరారు. జిల్లాలో ఇప్పటివరకు 98.96 శాతం ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ పూర్తయిందని, 25.79 శాతం ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయిందని తెలిపారు. ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, వివరాలు నింపే ప్రక్రియలో, ఓటర్ల నుంచి తిరిగి ఫారాలను స్వీకరించడం లో బీఎల్వోలకు రాజకీయ పార్టీల బీఎల్ఏలు పూర్తి సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.
========================
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంపై సమావేశం పాల్గోన్న కలెక్టర్, వివిధ పార్టీల ప్రతినిధులు
RELATED ARTICLES
