ePaper
Tuesday, September 22, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామికి దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సమర్పణ

కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామికి దేవస్థానం తరుపున పట్టువస్త్రాల సమర్పణ

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
కాణిపాకంలో శ్రీ వరసిద్ధి వినాయకస్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం తరుపున  పట్టువస్త్రాలు  సమర్పించబడ్డాయి.

ఈ నెల 14వ తేదీ నుండి ప్రారంభమైన కాణిపాక బ్రహ్మోత్సవాలు  అక్టోబరు 4వ తేదీన ముగియనున్నాయి.
ఈ మేరకు  శ్రీశైలదేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు,  ధర్మకర్తల మండలి సభ్యులు  జి. లక్ష్మేశ్వరి, జిల్లెల శ్రీదేవి,  ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు  వేమిరెడ్డి కోటారెడ్డి,  వాయిగండ్ల వెంకటేశ్వర్లు, ఆకుల శ్రీనివాసులు, అర్చకులు, వేదపండితులు, పలువురు అధికారులు,  తదితరులు ఈ పట్టువస్త్రాలను సమర్పించారు.
ఈ సమర్పణ కార్యక్రమములో పూతలపట్టు నియోజకవర్గం గౌరవ శాసనసభ్యులు డా. కె. మురళీమోహన్,  కాణిపాక దేవస్థాన ధర్మకర్తల మండలి వి. సురేంద్రబాబు, కార్యనిర్వహణాధికారి  కె.పెంచలకిషోర్, పలువురు ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చకులు, వేదపండితులు  పాల్గొన్నారు.
అనంతరం ఈ దేవస్థానం అధ్యక్షులను, ధర్మకర్తల మండలి సభ్యులను, అధికారులను, అర్చకస్వాములు, వేదపండితులు వేదాశీర్వచనముతో సత్కరించారు.

కాగా ఆలయ సంస్కృతి సంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని ప్రతిసంవత్సరం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల సమయములో శ్రీశైల దేవస్థానం తరపున ఈ పట్టువస్త్రాలను సమర్పించడం జరుగుతోంది.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!