హైదరాబాద్ ,అర్జున్ సమాచారం:
నేను నా మాటకు కట్టుబడి ఉన్నాను ఈ రోజు కి కూడా ..ఆపరేషన్ సక్సెస్ , పేషంట్ డెడ్ అన్నట్లు బీఆర్ఎస్ తీరు ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం అయన మీడియాతో మాట్లాడారు. తాము చేసిన అప్పులు మూడు లక్షల పదిహేడు వేల పదిహేను కోట్లు అని ఒక సారి, మూడు లక్షల 85,340 కోట్లు మాత్రమే అని మరో సారి కేటీఆర్ చెప్పాడు. 4 లక్షల 26 వేల 99 కోట్ల అప్పు అని ఒక సారి,4 లక్షల 17 వేల 496 మాత్రమే అని మరోసారి హరీష్ రావు చెప్పాడు. హరీష్ రావు, కేటీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన దానికి కట్టుబడి ఉన్నారా. నా మాటకు కట్టుబడి ఉన్నా.. రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నా. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు లేఖ రాస్తున్న.. రాత పూర్వకంగా సమాధానం ఇవ్వాలి. వాట్సాప్ ,మెయిల్ , స్పీడ్ పోస్ట్ ద్వారా ఈ లేఖ ను సీల్డ్ కవర్ లో పంపుతా. నేను చెప్పినదానికి కట్టుబడి ఉన్నా.. మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని అన్నారు.
మీరు చెప్పింది అబద్దం అయితే వాళ్లు ఏం చేస్తారో చెప్పాలి.. రాత పూర్వకంగా చెప్పాలి. ఏదో మాట్లాడి అసలు దానికి జవాబు చెప్పకుండా తప్పుదారి పట్టిస్తున్నారు. అప్పులు మూడు రకాలుగా ఉంటాయి. బీఆర్ఎస్ హయాంలో అప్పులు, బకాయిలు కలిపి 8,21,651 కోట్ల అప్పులు చేశారు. కార్పొరేషన్లు తెచ్చిన అప్పులతో మాకు సంబంధం లేదు, మేం తేలేదని చెపుతున్నారు.మీరు అప్పులు తేకపోతే ప్రభుత్వ ఖజానా నుంచి ఎందుకు చెల్లించారు. కాళేశ్వరం, పాలమూరు కోసం అప్పులు తెస్తే వాటిని రైతులతో కట్టిస్తారా… మిషన్ భగీరథ పేరుతో తెచ్చిన అప్పులు ఎవరు కడతారు..? మంచి నీళ్లు తాగుతున్న ప్రజలతో కట్టిస్తారా..? కేసీఆర్ అసెంబ్లీ కి రావడం లేదు.. కనీసం మీడియా ను పిలిచి కేసీఆర్ మాట్లాడాలి. 5 గంటలకు నేను ప్రెస్ క్లబ్ కు వస్తా.. అక్కడైనా చర్చకు సిద్ధం. రుజువు చేయపోతే ఎమ్మల్యే పదవులకు రాజీనామా చేస్తారా.. పార్టీని కేసీఆర్ రద్దు చేస్తారా.. సమాధానం తీసుకుని రావాలి. నేను రాజీనామాకు సిద్ధయని అన్నారు.
మిస్టర్ హరీష్ రావు, కేటీఆర్.. ఆనాడు పాలమూరు పౌరుషం , చీము ,నెత్తురు ఉండబట్టే మంత్రి పదవికి రాజీనామా చేశా. కుడి భుజం, ఎడమ భుజం అని చెప్పుకున్న మహబూబ్ నగర్ లో ఒక్క సీటు తేలేకపోయారు. నేను రాజీనామా చేశాకే జిల్లాలో 6 సీట్లు బీఆర్ఎస్ కు వచ్చాయి. నా రాజీనామా ప్రభావం రాష్ట్రమంతా ఉంది. నేను మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని. సిగ్గుతప్పిన మాటలు మాట్లాడుకుంటు నాకు పౌరుషం లేదని అంటున్నారు. హరీష్ రావు వస్తానని అన్నాడు కాబట్టే అమరవీరుల స్థూపం వద్దకు వస్తానని చెప్పాను. తెలంగాణ భవన్ కు రాలేదన్న వంక చూపించి విమర్శిస్తున్నారు. నేను అబద్దాలు చెప్పను.. నా ఆత్మగౌరవాన్ని ప్రశ్నించలేరు. ఆత్మ గౌరవం కోసం ప్రభుత్వ ఉద్యోగానికి నేను గతంలో రాజీనామా చేశాను. ఉద్యోగానికి వెళ్లకుండా ఊరు వెళ్లి వ్యవసాయం చేసుకున్నాను. మీ లాగా అడ్డగోలుగా సంపాదించలేదు. అడ్డగోలు మాటలు మాట్లాడి ఆరోపణలు చేస్తే కబర్దార్. పాలమూరు పౌరుషమా, కల్వకుంట్ల పౌరుషమా, తన్నీరు పౌరుషమో చెప్పాలి. నేను తోకముడిచేవాన్నీ కాదు. నాకు పదవులు ముఖ్యం కాదు.. ఆత్మగౌరవం ముఖ్యం. నా సవాల్ కు కట్టుబడి ఉన్నా. మీ పౌరుషం, రోషం, పరమితి ఏమిటో దమ్ము ధైర్యం ఉంటే చెప్పాలి. కూట్లో రాయి తీయలేనోడు,ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా కేటీఆర్, హరీష్ రావు తీరు ఉంది.. ఎన్నికల ముందు అవుటర్ రింగ్ రోెడ్డు ను అమ్మి రైతు బంధు కింద 5,800 కోట్లు మాత్రమే చెల్లించారని అన్నారు.
==============================
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు లేఖ రాస్తున్న.. రాత పూర్వకంగా జావాబివ్వాలి మంత్రి జూపల్లి కృష్ణారావు
RELATED ARTICLES

