ePaper
Saturday, August 22, 2026
ePaper
Homeజగిత్యాలకొండగట్టు ఆంజనేయ ఆలయంలో నిర్వహించిన జ్యేష్ఠాబిషేక పూజలు

కొండగట్టు ఆంజనేయ ఆలయంలో నిర్వహించిన జ్యేష్ఠాబిషేక పూజలు

📰 Generate e-Paper Clip

చొప్పదండి ,{మల్యాల మండలం}జూలై 6,అర్జున్ సమాచారం:

జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని మాల్యాల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో జ్యేష్ఠ మాసాన్ని సందర్బంగా సోమవారం జ్యేష్ఠాభిషేక మహోత్సవ పూజలు భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆంజనేయ స్వామివారిని ప్రత్యేకంగా ఆకర్షనీయంగా అలంకరించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణలతో పూజా ద్రవ్యాలతో పంచామృతాభిషేకం, ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం 108 కలశాలతో విశేష పూజలు నిర్వహించి స్వామివారికి మహాభిషేకం చేశారు. ఈ పూజా కార్యక్రమం తిలకించేందుకు తెలంగాణ నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆంజనేయ స్వామివారిని భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.ఈ సందర్బంగా ఆలయ ఈఓ ఎస్. అంజనారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అధికారులు, అర్చకులు, వేద పండితులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
==============================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!