ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeజగిత్యాల65 వ సుబ్రతో కప్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ అండర్...

65 వ సుబ్రతో కప్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ అండర్ 15 కెటగిరి లో 16 మంది విద్యార్థులు ఎంపిక

📰 Generate e-Paper Clip

65 వ సుబ్రతో కప్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ పోటీలకు జ్యోతి హైస్కూల్ అండర్ 15 కెటగిరి లో 16 మంది విద్యార్థులు ఎంపిక

జగిత్యాల జిల్లా ప్రతినిధి ::అర్జున్ సమాచారం ఆగస్టు 19::

జగిత్యాల పట్టణంలోని జ్యోతి హైస్కూల్ ఐఐటీ అకాడమీ కి చెందిన అండర్ 15 కెటగిరి టీమ్ జగిత్యాల లోని స్వామి వివేకానంద మినీ స్టేడియం క్రీడా మైదానం లో నిర్వహించిన జిల్లా స్థాయి ఫుట్ బాల్ పోటీలలో విజయం సాధించి , ఈ ఆగస్టు 20 వ తేదీ నుండి 22 వ తేదీ వరకు రంగారెడ్డి జిల్లా లోని గురుకుల విద్యాపీట్ 65 వ సుబ్రతో కప్ రాష్ట్ర స్థాయి ఫుట్ బాల్ అండర్ 15 కెటగిరి పోటీలకుఎంపిక కావడం జరిగింది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ బియ్యాల హరి చరణ్ రావు గారు అండర్ 15 టీమ్ కెప్టెన్ గంగం ప్రణవ్ కుమార్ ను 16 మంది విద్యార్థులను అభినందించి రాష్ట్ర స్థాయి లో ఉత్తమ ప్రతిభ చూపించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ బియ్యాల హరి చరణ్ రావు, శ్రీధర్ రావు, మౌనిక రావు, అజిత ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!