ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిజిల్లా పెయింటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

జిల్లా పెయింటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి,అర్జున్ సమాచారం:

పెద్దపల్లి జిల్లా పెయింటర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని జిల్లా కేంద్రంలో నియామకం చేసుకున్నారు. ఇందులో గౌరవ అధ్యక్షులుగా డాక్టర్ మంద భాస్కర్ యాదవ్, జిల్లా అధ్యక్షులుగా నాంసాని నర్సయ్య, ఉ పాధ్యక్షులుగా దావల్ల రవి,అరికోల్ల వెంకటేష్, బండారి శ్రీనివాస్, సెక్రటరీగా మినుముల సది, క్యాషియర్లు గా చంద్రగిరి సుమన్, పల్లె విజయ్, సలహాదారులుగా మెంగని నాగరాజు, తాడం ప్రసాద్, గడ్డం శంకర్, గరిగంటి రాజేందర్, మహ్మద్ తాజ్, ఆర్గనైజర్లుగా శనిగరం నాగరాజు, గడ్డం లక్ష్మణ్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు నాంసాని నర్సయ్య మాట్లాడుతూ ఇన్నేళ్ల తర్వాత పెయింటర్లం దరూ ఏకతాటిపైకి రావడం గర్వకారణమని, భవన నిర్మాణ రంగ కార్మికులంతా అన్నదమ్ముల్లా ఐక్యంగా ఉంటూ ఒకరికొకరు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. తమ వృత్తికి, ఇంటి యజమా నులకు తగిన గౌరవాన్ని ఇస్తూనే, సభ్యుల సమస్యల పరిష్కారానికి, సంఘం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఆయన పేర్కొన్నా రు. అనంతరం ముఖ్యఅతిథి గా హాజరైన మార్బుల్ అండ్ టైల్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కల్లపెల్లి రవి నూతన కమిటీని సన్మానించి శుభాకాంక్షలు తెలుపుతూ,ఈ ఐక్యత భవిష్యత్తులో పెయింటర్ల హక్కుల సాధనకు,అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ గ్రామాలకు చెందిన పెయింటర్లు పాల్గొన్నారు.
================================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!