నాగర్ కర్నూల్,అర్జున్ సమాచారం:
ప్రభుత్వా నికి చెల్లించాల్సిన ధాన్యం మాయం చేసిన ఆరోపణ లపై తాడూరు మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనారా యణ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లుపై పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా సివిల్ సప్లై అధికారి రాజేందర్ ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి కేసు నమోదు చేసి నట్లు తాడూరు ఎస్సై రాములు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి తిరిగి ప్రభు త్వానికి చెల్లించాల్సి ఉండగా, మిల్లుకు సంబంధించిన సుమారు రూ.19.59 కోట్ల విలువైన 8,755 మెట్రిక్ టన్నుల ధాన్యం అందుబాటులో లేదని సివిల్ సప్లై, విజిలెన్స్ అధికారులు తనిఖీల్లో గుర్తించారు. ధాన్యం చెల్లించాలంటూ మిల్లుకు పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో అధికారులు తని ఖీలు నిర్వహించారు.
మిల్లు యజ మాని పొను గంటి సుధాకర్‌రావు, ఆయన భాగస్వాములపై కేసు నమో దు చేసినట్లు ఎస్సై తెలిపారు. సివిల్ సప్లై అధికారుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
====================

