హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ కాంగ్రెస్ లో మరోసారి అలజడి బయటపడింది. మంత్రి కొండా సురేఖకు తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్‌తో కడియం శ్రీహరి ఎండోమెంట్ రివ్యూ నిర్వహించారు. స్టేషన్‌ఘన్‌పూర్ పరిధిలోని ఆలయాల పరిస్థితులపై హైదరాబాద్‌లో కడియం శ్రీహరి రివ్యూ నిర్వహించారు. దేవదాయ శాఖ మంత్రినైన తనకే తెలియకుండా కడియం శ్రీహరి రివ్యూ చేయడంపై మంత్రి కొండా సురేఖ తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. కడియం శ్రీహరిపై స్టేట్ కమాండ్‌కి కాకుండా నేరుగా హైకమాండ్‌కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మరోవైపు, తనకు చెప్పకుండా హైకమాండ్‌కి మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు చేయడంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరా తీసారు. హైకమాండ్‌కు రాసిన లేఖను బహిర్గత పరచొద్దని మంత్రి కొండా సురేఖకు మహేష్ కుమార్ గౌడ్ సూచించారు.
