ePaper
Friday, November 13, 2026
ePaper
Homeతెలంగాణతెలంగాణ బార్ కౌన్సిల్ చేరిన690 మంది న్యాయ పట్టభద్రులు తాత్కాలిక నమోదు కమిటీచే...

తెలంగాణ బార్ కౌన్సిల్ చేరిన690 మంది న్యాయ పట్టభద్రులు తాత్కాలిక నమోదు కమిటీచే ప్రమాణ స్వీకారం హైదరాబాద్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గం ఈరోజు 690 మంది న్యాయ పట్టభద్రుల లాంఛన నమోదును నిర్వహించింది. వీరిలో 657 మంది పట్టభద్రులు తాత్కాలిక నమోదు కమిటీ పర్యవేక్షణలో తమ వృత్తిపరమైన ప్రమాణాన్ని స్వీకరించారు. భారత బార్ కౌన్సిల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ బార్ కౌన్సిల్ ఛైర్మన్  సమూల రామ్ రెడ్డి, వైస్-ఛైర్మన్  వెంకట్ యాదవ్ చాలకాని, సభ్యులు  జి. కిరణ్ కుమార్ ఉన్నారు.
రాష్ట్ర  హైకోరర్టు  న్యాయమూర్తులు జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి,  జస్టిస్ జువ్వాది శ్రీదేవి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హజరయ్యారు. న్యాయమూర్తులు మాట్లాడుతూ తమ సుదీర్ఘ న్యాయ ప్రస్థానాన్ని వివరించారు. ప్రాక్టీసింగ్ న్యాయవాదులుగా  న్యాయమూర్తులుగా తమకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించి, కొత్తగా ప్రవేశించేవారికి స్ఫూర్తినిచ్చి, మార్గనిర్దేశం చేశారు.
తరువాత,  బార్ కౌన్సిల్ సభ్యులు  అశోక్ గౌడ్ పొన్నం,  మహేష్ కుమార్ ఆకుల,  అనంతసేన్ రెడ్డి ఆకుల,  సునీల్ గౌడ్.కె,   రఘునాథ్ వెరోస్,  జగదీశ్వర రావు.డి,  రామారావు గోకుల్,  రాఘవులు.డి, భాను చంద్రిక.సిహెచ్,  సుజాత పాశం,  సునీత.బి, జ్యోతి జాదవ్ ఈ కార్యక్రమానికి హాజరైయారు.
==================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!