ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeతెలంగాణఆదిలాబాద్నకిలీ నోట్లతో మోసం.. ఆరుగురు సభ్యుల ముఠా గుట్టురట్టు

నకిలీ నోట్లతో మోసం.. ఆరుగురు సభ్యుల ముఠా గుట్టురట్టు

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
ఆదిలాబాద్‌లో ‘చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ పేరుతో నకిలీ కరెన్సీ నోట్లను ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు గుర్తించారు. నలుగురిని అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు నిందితులు వేరే కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. వారి నుంచి రూ.40 లక్షలకు పైగా విలువైన 99 నకిలీ నోట్ల కట్టలు, 100 నకిలీ బంగారు నాణేలు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
పూజలతో డబ్బును రెట్టింపు చేస్తామని నమ్మించి మోసాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మంచిర్యాలకు చెందిన ఓ బాధితుడు రూ.8 లక్షలు కోల్పోయినట్లు వెల్లడించారు. తెలంగాణలో సుమారు 40 మంది బాధితులు ఉండవచ్చని అనుమానిస్తున్నారు. డబ్బు రెట్టింపు చేస్తామనే హామీలను నమ్మవద్దని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!