నిర్మల్ ,అర్జున్ సమాచారం:
నిర్మల్ సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవం జన సందోహంతో ఘణంగా జరిగింది.ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాజేష్ ప్రారంభించారు.అందరికి అందుబాటు ధరలలో వన్ స్టాప్ మాల్ సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) నిర్మల్,బోయివాడ,నటరాజ్ నగర్ లో ప్రారంభించబడం ఎంతో సంతోషదాయకమని అన్నారు.షోరూం మేనేజింగ్ డైరెక్టరు జానా సురేష్ మాట్లాడుతూ 40 సంవత్సరాల అనుబంద సంస్థ తెలుగు రాష్ట్రాలలో ప్రారంభించిన ప్రతి చోటా అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల మన్ననలతో నెం.1 షోరూంగా నిలుస్తుండడం తమకు ఎంతో ఉత్సాహాన్ని,మరిన్ని ప్రదేశాలలో ప్రారంభించాలనే ప్రోత్సాహాన్ని అందిస్తుందని,నిర్మల్ విషయంలోనైతే షోరూం తీర్చిదిద్దడంలో గాని,ఇక్కడి ప్రజల అభిరుచికి సరిపడే వస్త్రాలు ఎంపిక చేయడంలోగాని ప్రత్యేక శ్రద్ధ పెట్టడంవలన ఇక్కడి కస్టమర్ల అభిమానాన్ని మరింత వేగంగా పొందుతామనడంలో తమకు అపారమైన నమ్మకంమందని తెలియజేసారు.అన్ని ఆదాయ వర్గాలకూ అందుబాటు ధరలలో నాణ్యమైన సంప్రదాయ వస్త్రాలనూ అలానే మోడ్రన్ ఫ్యాషన్లనందించడంలో మరింత ముందుటామని అదే తమ విజయరహస్యమని తెలియజేసారు.ప్రారంభోత్సవ మరియు దసరా,దీపావళి వేడుకల సందర్భంగా అన్ని రకాల వస్త్రాలపై తగ్గింపు ధరల తో మా కస్టమర్స్ కి అందుస్తున్నాము అని అన్నారు.ప్రముఖ సినీనటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ తాము సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) ప్రారంభోత్సవంలో భాగం కావడం ఎంతో సంతోషకరమని,ఎందుకంటే నిర్మల్ లో ప్రతి చిన్న అవసరానికి,అది ఇంట్లో ఏ ఫంక్షన్లకైనా,షూటింగ్ కాస్ట్యూంలకైనా తాము మొదటిగా వెళ్ళేది సిబియస్ (చందన బ్రదర్స్ షాపింగ్ మాల్) కేనని,ఇక్కడ లభించే డిజైన్లూ-వెరైటీలూ వేరెక్కడా లభించవని,అందుకే ఇది హైదరాబాదీల ఫేవరిట్ షోరూంగా మారిందని అన్నారు.ఇక మొదటిగా తామే షాపింగ్ చేయాలని వచ్చిన కస్టమర్ల ఆనందానికైతే హద్దేలేకుండా పోయింది ముఖ్యంగా స్త్రీల సంతోషం పట్టనలవికాకుండా ఉంది.ప్రారంభోత్సవ ఆఫర్లతో అతి తక్కువ ధరలతో ఉన్న చీరలను చూసి మురిసిపోతూ షాపింగ్ బుట్టలలో చీరలను నింపేయడం ప్రతి ఫ్లోర్లోనూ
కనిపించింది.
==========================

