ePaper
Friday, October 2, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్అమరావతిపోలీస్ శాఖ ఏర్పాటు చేసిన “ఆపరేషన్ త్రిశూల్” ప్రదర్శన స్టాల్ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన “ఆపరేషన్ త్రిశూల్” ప్రదర్శన స్టాల్ను పరిశీలించిన సీఎం చంద్రబాబు

📰 Generate e-Paper Clip

బాపట్ల,అర్జున్ సమాచారం:
ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు  రేపల్లె పర్యటనలో భాగంగా ప్రజా వేదిక వద్ద బాపట్ల జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ఆపరేషన్ త్రిశూల్” ప్రదర్శన స్టాల్ను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  బి.ఉమామహేశ్వర్  జిల్లాలో నేర నియంత్రణ, గంజాయి, డ్రగ్స్ నిర్మూలన, మహిళలు, బాలికల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖ చేపడుతున్న వివిధ చర్యలు, వాటి ద్వారా సాధించిన ఫలితాలను ముఖ్యమంత్రి కి వివరించారు.
జిల్లాలో గంజాయి డ్రగ్స్ రహిత వాతావరణం కల్పించడమే లక్ష్యంగా “ఆపరేషన్ త్రిశూల్” ద్వారా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచేందుకు జిల్లావ్యాప్తంగా 661 ఈగిల్ క్లబ్లను ఏర్పాటు చేసి 5,334 అవగాహన కార్యక్రమాలను నిర్వహించామన్నారు. 19 కేసులలో 287 కిలోల గంజాయి సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా, విక్రయాలు వినియోగానికి పాల్పడే వారిపై నిఘా ఉంచామన్నారు. 1,467 మంది పాత నేరస్థుల పై నిరంతర నిఘా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వారి కార్యకలాపాలను పర్యవేక్షించడం జరుగుతుందని, మరో 7,012 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామని తెలిపారు. గంజాయి, డ్రగ్స్ ను, వాటిని సేవించిన వారిని పరీక్షించేందుకు నూతనంగా జిల్లాకు కేటాయించబడిన గంజాయి టెస్ట్ కిట్స్ పనితీరును గురించి ముఖ్యమంత్రి కి వివరించారు.
మహిళలు, బాలికల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ పోలీస్ శాఖ చేపట్టిన చర్యల ఫలితంగా జిల్లాలో మహిళ సంబంధిత నేరాలు 22.55 శాతం, అత్యాచారా కేసులు 25 శాతం, పోక్సో కేసులు 50 శాతం మేర తగ్గాయని తెలిపారు. జిల్లాలో మహిళలు, బాలికల్లో భద్రతపై అవగాహన కల్పించేందుకు 4 శక్తి బృందాల ఆధ్వర్యంలో 3,649 అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు 1,35,475 మంది మహిళలు వారి మొబైల్ ఫోన్ లలో శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకునేలా విస్తృత ప్రచారం నిర్వహించడం జరిగిందన్నారు.
జిల్లా పోలీస్ శాఖ పనితీరు పట్ల ముఖ్యమంత్రి  సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా ఎస్పీ ని ప్రత్యేకంగా అభినందించి ఇదే విధానాన్ని కొనసాగించాలని తెలిపారు
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!