మహబూబ్ నగర్,అర్జున్ సమాచారం:
సోమశిల దుర్ఘటన జరిగి 33 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన అప్పటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ పరదేశి నాయుడు, పోలీసు అమరవీరులకు జిల్లా ఎస్పీ డి.జానకి, ఘనంగా నివాళులర్పించారు.
మహబూబ్నగర్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పరదేశి నాయుడు సర్కిల్ వద్ద ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన స్మారక కార్యక్రమంలో చిత్రపటానికి పూలమాల వేసి అమరవీరులను స్మరించుకుంటూ పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి నినాదాలు చేశారు.
1993 నవంబర్ 14న సోమశిలలో విధి నిర్వహణకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో అప్పటి జిల్లా ఎస్పీ పరదేశి నాయుడు సహా మొత్తం 9 మంది పోలీసు అధికారులు, సిబ్బంది వీరమరణం పొందారు. ఈ ఘటన రాష్ట్ర పోలీసు చరిత్రలో ఒక విషాదకర ఘట్టంగా నిలిచిపోయింది.
సోమశిల దుర్ఘటనలో అమరులైన వారు:
1. పరదేశి నాయుడు – ఐపీఎస్
2. కిషోర్ కుమార్ – ఎస్ఐ
3. శివ ప్రసాద్ – ఎస్ఐ
4. రంగారెడ్డి – హెడ్ కానిస్టేబుల్
5. ఎన్. ప్రసాద్ – కానిస్టేబుల్
6. సుభాన్ – కానిస్టేబుల్
7. జహాబ్ ఇక్బాల్ – కానిస్టేబుల్
8. జయరాములు – కానిస్టేబుల్
9. షేక్ హైదర్ – కానిస్టేబుల్
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, అమర పోలీసుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని, వారు చూపిన ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠ నేటితరం పోలీసులకు ఆదర్శమని పేర్కొన్నారు. పోలీసు సిబ్బంది ఆత్మస్థైర్యంతో విధులు నిర్వర్తిస్తూ ప్రజల రక్షణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలోఏఆర్ అదనపు ఎస్పీ సురేష్ కుమార్, డీఓప్పీ వెంకటేశ్వర్లు, DCRB DSP రమణా రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య, టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్ RI లు నగేష్, కృష్ణయ్య, అశోక్ కుమార్, RSI లు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
======================
పరదేశి నాయుడు, తోసహా 9 మంది పోలీసు అమరవీరులకు నివాళులర్పించిన జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ మహబూబ్ నగర్
RELATED ARTICLES

