ePaper
Thursday, September 24, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్పవర్ ప్లాంట్ ల నిజానిజాలు తేల్చడానికి బీఆర్ఎస్ బృందాలు కేటీఆర్

పవర్ ప్లాంట్ ల నిజానిజాలు తేల్చడానికి బీఆర్ఎస్ బృందాలు కేటీఆర్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
తెలంగాణ థర్మల్ పవర్ స్టేషన్లలో ఏం జరుగుతుందో నిజానిజాలు తేల్చడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆరు బృందాలు రేపు పవర్ స్టేషన్లకు వెళ్తాయపి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కేటీఆర్ అన్నారు. యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఇతర నల్గొండ నాయకులు బృందం, కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బృందం, కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి బృందం, సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ పర్యటనకు వెళ్లనున్న మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు అనిల్ జాదవ్, కోవా లక్ష్మీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోనేరు కోనప్ప, దుర్గం చిన్నయ్య, దివాకర్ రావు, సింగరేణి ప్రధాన కార్యాలయం పర్యటనకు వెళ్లనున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్,  ఎమ్మెల్యే కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు లు వెళతారని అయన అన్నారు.
కేటీఆర్ మాట్లాడుతూ సోషల్ మీడియాలో 1980‘s ట్రెండ్ నడుస్తుంది.. తెలంగాణలో 1980‘s రోజుల్లో కరెంట్ కోతలతో రైతులు అవస్థలు పడినట్లు ఇప్పుడు అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ఉంటే కరెంట్ ఉండదని మేము ముందే చెప్పాం.. ఇవాళ అదే జరుగుతుంది. తెలంగాణలో ప్రతి చోట కరెంట్ కోతలు ఉన్నాయని రోజూ పత్రికల్లో వస్తున్నాయి. వీటి మీద సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్లి చెక్ చేస్తే 6 గంటలకు మించి కరెంట్ ఇవ్వడం లేదు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే కరెంట్ ఉండదని అన్నాడు. కానీ తెలంగాణ తెచ్చి 24 గంటలు కరెంట్ ఇచ్చి చూపించాం.. మళ్లీ ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లు రేవంత్ రెడ్డి కరెంట్ లేకుండా చేస్తున్నాడని విమర్శించారు.
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!