ePaper
Wednesday, September 23, 2026
ePaper
Homeక్రైమ్ న్యూస్వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల అరెస్ట్.

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల అరెస్ట్.

📰 Generate e-Paper Clip

వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితుల అరెస్ట్.

అర్జున్ సమాచారం సెప్టెంబర్ 23 బెల్లంపల్లి నియోజకవర్గ ప్రతినిధి.

రూ.50,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 10 కిలోల కాపర్ వైర్, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం.రామగుండం పోలీస్ కమిషనరేట్ మంచిర్యాల జోన్ బెల్లంపల్లి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లు, దుకాణాలు, వ్యవసాయ భూముల్లోని ట్రాన్స్‌ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.50,000 నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, 10 కిలోల కాపర్ వైర్, ఐదు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్న మని ఏసీపీ తెలిపారు.
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ అంబర్ కిషోర్ ఝా, ఐపీఎస్ మరియు మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మరియు తాండూర్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ దేవయ్య పర్యవేక్షణలో తాండూర్ పోలీసులు ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టి తాండూర్, భీమిని, బెల్లంపల్లి, నెన్నెల్, తాళ్లగురిజాల, తిర్యాని, రెబ్బెన పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దొంగతనాలపై దర్యాప్తు చేపట్టి, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకొని అనంతరం వారిని అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు హాజరుపరినట్లు బెల్లంపల్లి ఏసిపి కిరణ్ కుమార్ తెలిపారు.అరెస్ట్ అయిన నిందితుల వివరాలు

బండి నీలేష్, తండ్రి: లక్ష్మణ్, వయస్సు: 37 సంవత్సరాలు, కులం: ST కొలవార్, వృత్తి: బైక్

  1. మెకానిక్, నివాసం: బోయపల్లి బోర్డు, ప్రస్తుతం నార్లపూర్, రెబ్బెన మండలం.
  2. దూల రాజేశాం, తండ్రి: మల్లేష్, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ST కొలవార్, వృత్తి: కూలీ, నివాసం: కతేర్ల, తాండూర్.
  3. మీసాల బిక్షపతి, తండ్రి: మల్లమ్మ, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ST కొలవార్, వృత్తి: కూలీ, నివాసం: కతేర్ల, తాండూర్.
  4. దూల నవీన్, తండ్రి: మల్లేష్, వయస్సు: 26 సంవత్సరాలు, కులం: ST కొలవార్, వృత్తి: కూలీ, నివాసం: కతేర్ల, తాండూర్.
  5. ఈగం రాజేష్, తండ్రి: మల్లేష్, వయస్సు: 39 సంవత్సరాలు, కులం: ST కొలవార్, వృత్తి: కూలీ, నివాసం: బట్వ్యాన్పల్లి గ్రామం, బెల్లంపల్లి మండలం.
  6. రెబ్బెన శ్రీకాంత్, తండ్రి: అరజయ్య, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: ఎస్ టి కొలవార్, వృత్తి: కూలీ, నివాసం: రోళ్లపాడు గ్రామం, రెబ్బెన మండలం.

స్వాధీనం చేసుకున్న వస్తువులు

రూ.50,000 నగదు.

  • టీఎస్ 19 జె 3474 – హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ద్విచక్ర వాహనం
  • ఏపీ 25 క్యూ 0753 – హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనం
  • 05 సెల్‌ఫోన్లు
  • 10 కిలోల కాపర్ వైర్

పోలీసు సిబ్బందికి అభినందనలు

నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన తాండూర్ సీఐ, భీమిని ఎస్‌ఐ, తాండూర్ ఎస్‌ఐ మరియు వారికి సహకరించిన పోలీస్ సిబ్బందిని అధికారులు అభినందించారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించి నిందితులను పట్టుకోవడంలో విశేష కృషి చేసిన హెడ్ కానిస్టేబుళ్లు టి. రాజేశ్వర్ (2113), ఎం. రాము (2823), వి. తిరుపతిరెడ్డి (363), కానిస్టేబుళ్లు ఎం. విజయ్ కుమార్ (2064), బి. తిరుపతి (3315) లను బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ ప్రత్యేకంగా అభినందించి, క్యాష్ రివార్డ్ అందజేశారు.

నేరాల నియంత్రణలో భాగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ నేరస్తులను గుర్తించి, చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో పోలీస్ అధికారులు, సిబ్బంది మరింత సమర్థవంతంగా పనిచేయాలని ఏసీపీ సూచించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!