ePaper
Sunday, August 23, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిపాక్స్ కమిటీలు రైతులకు అందుబాటులో వుండాలి పెద్దపల్లి పాక్స్ నూతన కమిటీ సభ్యులకు విప్ చింతకుంట...

పాక్స్ కమిటీలు రైతులకు అందుబాటులో వుండాలి పెద్దపల్లి పాక్స్ నూతన కమిటీ సభ్యులకు విప్ చింతకుంట విజయరమణారావు అభినందనలు

📰 Generate e-Paper Clip

పెద్దపల్లి,అర్జున్ సమాచారం:
పెద్దపల్లి ప్రాథమిక వ్యవసా య సహకార సంఘం (పాక్స్) నూతనంగా ఎన్నికైన చైర్మన్ ముత్యాల నరేష్ ముదిరాజ్, కమిటీ సభ్యులు ప్రభుత్వ విప్, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావును  మర్యాదపూర్వకం గా కలిసి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా విప్ విజయరమణారావు చైర్మన్ ముత్యాల నరేష్, డైరెక్టర్లకు అభినందనలు తెలిపారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తూ సహకార సంఘం ద్వారా రైతులకు అందుబాటులో ఉన్న అన్ని సేవలు, ప్రభుత్వ పథకాలు, రుణ సదుపాయాలపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు. రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సమస్యలను తెలుసుకొని సకాలంలో పరిష్కరించేందు కు కృషి చేయాలని, సహకార సంఘాన్ని రైతులకు మరింత ఉపయోగపడే విధంగా అభివృద్ధి చేయాలని విజయ రమణారావు నూతన కమిటీకి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పాక్స్ సిఈఓ మెట్టు మధు, డైరెక్టర్లు నాంసాని సతీష్, ఎనగందుల రవీందర్, పిన్ రెడ్డి సుధాకర్ రెడ్డి, మేకల మల్లేష్, కలవేన సంపత్, జూపల్లి తిరుపతి రావు, ధోనేటి స్వరూప,వేల్పుల శ్రీనివాస్, పూరేళ్ల శంకర్ గౌడ్, భగీరం శ్రీనివాస్, ఈదునూరి ప్రసన్న, మానుపాటి రవి పాల్గొన్నారు. అనంతరం నూతన కమిటీని విప్ విజయ రమణారావు ఘనంగా సన్మానించారు.
========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!