భద్రాద్రి కొత్తగూడెం,అర్జున్ సమాచారం:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. పాల్వంచలోని నవ లిమిటెడ్ సంస్థ యాజమాన్యం ఆహ్వానం మేరకు అక్కడి వేంకటేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన పూజా
కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమని భువనేశ్వరితో కలిసి పాల్గొన్నారు. పాల్వంచలో కార్యక్రమానికి వచ్చిన సీఎం చంద్రబాబుకు తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
సాంబశివరావు, జిల్లా అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులకు ముఖ్యమంత్రి అభివాదం చేసి ధన్యవాదాలు తెలిపారు.

