ePaper
Sunday, November 29, 2026
ePaper
Homeజగిత్యాలకొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న గవర్నర్...

కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్న గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా దంపతులు చొప్పదండి

📰 Generate e-Paper Clip

చొప్పదండి,అర్జున్ సమాచారం:
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా ఈ నెల 30వ తేదీన సోమవారం జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నట్లు జగిత్యాల జిల్లా పౌరసంబందాల శాఖ అధికారిక పత్రిక ప్రకటన విడుదల చేశారు.వారు తెలిపిన వివరాల ప్రకారం గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా తన సతీమణి శ్రీమతి జానకి శుక్లా, అధికారిక సిబ్బందితో కలిసి నవంబర్ 30వ తేదీ ఉదయం 9:20 గంటలకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్ నుంచి బయలుదేరి 9:30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 9:40 గంటలకు హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 10:30 గంటలకు జగిత్యాల జిల్లా నుండి కొండగట్టు దేవస్థానం సమీపంలోని జేఎన్‌టీయూ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.అనంతరం ఉదయం 10:35 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 10:45 గంటలకు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలోని కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానానికి చేరుకొని
ఉదయం 10:45 నుంచి 11:30 గంటల వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, ఆశీర్వచనం, సన్మాన కార్యక్రమంలో పాల్గొంటారు.
ఉదయం 11:30 గంటలకు ఆలయం నుంచి బయలుదేరి 11:40 గంటలకు నాచుపల్లిలోని జేఎన్‌టీయూకు చేరుకుంటారు. ఉదయం 11:40 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో పాటు ఇతర జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొంటారు.
అనంతరం మధ్యాహ్నం 12:45 నుంచి 1:30 గంటల వరకు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 1:30 గంటలకు నాచుపల్లి జేఎన్‌టీయూ హెలిప్యాడ్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి 2:20 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారని అక్కడి నుంచి 2:25 గంటలకు బయలుదేరి 2:35 గంటలకు హైదరాబాద్‌లోని లోక్‌భవన్‌కు చేరుకుంటారని డిపిఆర్వో కార్యలయం అధికారులు పత్రిక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!