ePaper
Friday, October 30, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్మహాపాదయాత్రపై బిగ్ ప్లాన్

మహాపాదయాత్రపై బిగ్ ప్లాన్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్ అక్టోబరు 29,అర్జున్ సమాచారం:
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎండగట్టేందుకు బిజెపి భారీ వ్యూహంతో ముందుకు వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి.. అరాచకాన్ని అడ్డుకోండి అనే శక్తివంతమైన నినాదంతో నవంబర్ 2న ట్యాంక్‌బండ్ వేదికగా బిజెపి మహా పాదయాత్రను చేపట్టనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్వయంగా ఈ పాదయాత్రలో పాల్గొని తెలంగాణ రణక్షేత్రంలో బిజెపి శ్రేణులకు దిశానిర్దేశం చేయనుండటంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా హడావుడి ప్రారంభమయింది.కాంగ్రెస్ ఓట్ చోరీ డ్రామాకు అమిత్ షా కౌంటర్ ఇచ్చేందుకు ఈ పాదయాత్ర చేపట్టారు. నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీ ఆరోపణలతో నిర్వహించనున్న ర్యాలీకి సరిగ్గా మరుసటి రోజే హైదరాబాద్ వేదికగా అమిత్ షా ఈ పాదయాత్రలో పాల్గొనడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టడమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం. మరణించినవారు, చిరునామాలు మారినవారి వివరాల సవరణను కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని, ప్రజల్లోకి నేరుగా వెళ్లి నిజాలను వివరించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి స్వయంగా రంగానికి దిగుతున్నారు.ఈ మహా పాదయాత్ర కేవలం ఓటర్ల జాబితా వివాదానికే పరిమితం కాకుండా, రాష్ట్రంలో రోజురోజుకూ దిగజారుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా వైఫల్యాలను నిలదీసేలా బిజెపి రూపకల్పన చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 300కు పైగా మండలాల్లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడం, రాజధాని హైదరాబాద్‌లోనే రోజుకు వేలాది వాటర్ ట్యాంకర్ల కోసం ప్రజలు అల్లాడుతున్నా పట్టించుకోని రేవంత్ సర్కార్ తీరును బిజెపి ఎండగట్టనుంది. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనలతో కాలక్షేపం చేస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు ఘాటుగా విమర్శించారు.ట్యాంక్‌బండ్ నుంచి ప్రారంభమయ్యే ఈ పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి బిజెపి గట్టి హెచ్చరికలు జారీ చేయనుంది. అమిత్ షా రాకతో బిజెపి శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లివిరిస్తుండగా,అధికార కాంగ్రెస్ దీనిపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
=================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!