ePaper
Saturday, August 29, 2026
ePaper
Homeసినిమాఫోర్బ్స్ ఇండియా షో స్టాప‌ర్స్‌ 2026 కవర్‌ పేజీపై అల్లు అర్జున్

ఫోర్బ్స్ ఇండియా షో స్టాప‌ర్స్‌ 2026 కవర్‌ పేజీపై అల్లు అర్జున్

📰 Generate e-Paper Clip

జాతీయ అవార్డు గ్రహీత, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. భారతదేశంలోని టాప్ 100 ప్రముఖ సెలబ్రిటీలను సెలబ్రేట్ చేస్తూ రూపొందించిన ఎంతో ప్రతిష్టాత్మకమైన ఫోర్బ్స్ ఇండియా ‘షో స్టాప‌ర్స్‌ 2026’ ఎడిషన్ కవర్‌పై ఆయన త‌న‌దైన స్టైల్లో మెరిశారు. ఈ కవర్ పేజీ ద్వారా సెలబ్రిటీల ప్రభావం, క్రేజ్‌కు సంబంధించి అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన స్టార్‌డమ్ స్థాయి, బాక్సాఫీస్ వద్ద సత్తా, అలాగే ఒక స్టార్‌గా ఆయన అసాధార‌ణ‌మైన‌ బ్రాండ్ వేల్యూ ఈ గుర్తింపుతో మరోసారి స్పష్టమైంది.
తెలుగు సినిమా నుంచి నిజమైన పాన్ ఇండియా ఫినామినన్‌గా అల్లు అర్జున్ ప్రభావం ఎంత దూరం విస్తరించిందో చెప్ప‌టానికి ఇదొక గొప్ప తిరుగులేని గుర్తింపు. నటన, వ్యక్తిత్వం, ప్రేక్షకులతో ఆయనకున్న అసాధారణ అనుబంధం.. ఈ అరుదైన కలయికే అల్లు అర్జున్‌ను జాతీయ స్థాయిలో అగ్రస్థానానికి తీసుకెళ్లింది. ‘పుష్ప’ ఫ్రాంచైజీతో అప్పటికే ఉన్న ఆయన భారీ క్రేజ్ మరింత విస్తరించి, దేశవ్యాప్తంగా ఒక సాంస్కృతిక ప్రభంజనంగా మారింది. అల్లు అర్జున్ ప్రత్యేకమైన స్టైల్, మేనరిజమ్స్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్ భాషా, ప్రాంతీయ హద్దులను దాటి దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు వెంటనే గుర్తుకు తెచ్చాయి.
ఫోర్బ్స్ ఇండియా నుంచి వచ్చిన ఈ గుర్తింపు.. అల్లు అర్జున్ తన పేరుతో నిర్మించుకున్న కమర్షియల్ పవర్‌ను కూడా స్పష్టంగా తెలియజేస్తోంది. భారతదేశంలో అత్యంత విలువైన, అత్యధిక గుర్తింపు ఉన్న సెలబ్రిటీల్లో ఆయన నిరంతరం చోటు దక్కించుకోవడం చూస్తే.. ఆయన ఎఫెక్ట్‌ ఇప్పుడు కేవలం సినిమాలకే పరిమితం కాలేదనేది తెలుస్తోంది. ఇలాంటి సమయంలో ‘షో స్టాప‌ర్స్‌ 2026’ ఎడిషన్‌కు ముఖచిత్రంగా అల్లు అర్జున్ నిలవటం మరింత ప్రత్యేకమైన విషయం. ఫోర్బ్స్ ఇండియా ప్రతి ఏడాది నిర్వహించే ఈ వేడుకలో పాపులర్ కల్చర్‌ను ప్రభావితం చేస్తూ, తమ ప్రధాన వృత్తిలో విస్తృత స్థాయి ప్రభావం చూపుతున్న ప్రముఖ వ్యక్తులను ఒకే వేదికపైకి తీసుకువస్తుంది.
బాక్సాఫీస్‌పై తన ఆధిపత్యం, రోజురోజుకూ విస్తరిస్తున్న బ్రాండ్ ఇమేజ్, దేశవ్యాప్తంగా పెరుగుతున్న అభిమాన వర్గంతో.. ఫోర్బ్స్ ఇండియా కవర్‌పై చోటు దక్కించుకోవడం అల్లు అర్జున్ అద్భుతమైన ప్రయాణంలో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఒక అసాధారణ ఫినామినన్‌గా అల్లు అర్జున్ సృష్టిస్తోన్న‌ ప్రభంజనానికి ఇది మరో గొప్ప గుర్తింపుగా చెప్పొచ్చు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!