ePaper
Friday, August 28, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాల8సమస్యల పరిష్కారానికి టిజిఈజేఏసి "మహాధర్నా" -సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం

8సమస్యల పరిష్కారానికి టిజిఈజేఏసి “మహాధర్నా” -సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమం తీవ్రతరం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల, ఆగస్టు 27,అర్జున్ సమాచారం:

ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లను రాష్ట్రప్రభుత్వం వెంటనే చర్చలు జరిపి, సమస్యలు పరిష్కరించాలని, లేనిపక్షంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి, ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని టిజిఈజేఏసి నాయకులు డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ (టిజిఈజేఏసి) పిలుపుమేరకు గురువారం టీజీఈజేఏసి జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి, సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి ల ఆధ్వర్యంలో జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత కార్యాలయాల భవన సముదాయం ఎదుట మహా ధర్నాను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా గల అన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల అసోసియేషన్లు, ఆఫీస్ సబార్డినేట్ నుంచి జిల్లా స్థాయి అధికారులు సుమారు 4500 మంది హాజరై, మహా ధర్నా కార్యక్రమంలో పాల్గొని, నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ఐడిఓసి ముఖద్వారం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టి, అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పలు డిమాండ్ లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కుమార దీపక్ అందజేశార ఈ సందర్భంగా టీజీఈజేఎసి జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మాట్లాడుతూ, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి సంఘాలన్నీ ఐక్యంగా కృషి చేయాలన్నారు. ఉద్యోగులకు 2వ పిఆర్సి ని తక్షణమే అమలు చేయాలని, పెండింగ్‌ లో ఉన్న 6 విడతల డిఏ లను వెంటనే విడుదల చేయాలని, ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన ఈహెచ్ఎస్ ను తక్షణమే సమర్థవంతంగా అమలు చేయాలని, పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రతి నెల 2,000 కోట్ల రూపాయలు విడుదల చేసి ఉద్యోగులకు బకాయిలను త్వరితగతిన చెల్లించాలని, ఉద్యోగుల సిపిఎస్ సమస్యను పరిష్కరించి ఉద్యోగం న్యాయం చేయాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాలకు, అసోసియేషన్లకు తగిన గుర్తింపు కల్పించాలి, సమస్యలను అధికారికంగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిగణించి, చర్చల ద్వారా తక్షణ పరిష్కారం చూపాలని కోరారు. న్యాయమైన డిమాండ్ ఉద్యోగుల ఆర్థిక సామాజిక సేవ ప్రజలకు సంబంధించిన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే స్పందించి వెంటనే చర్చలు పిలిచి సమస్యలు తక్షణం పరిష్కారం చూపాలన్నారు జిల్లా సెక్రెటరీ జనరల్ వనజా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అవసరమైన తదుపరి కార్యాచరణను సంఘాల నాయకులతో సమన్వయం చేసుకొని చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో  టిజిఈజేఏసీ అదనపు సెక్రటరీ జనరల్  కే శంకర్, జిల్లా కో చైర్మన్లు జి చక్రపాణి, శ్రీనివాస్ రావు దేశ్ పాండే, పొన్న మల్లయ్య, శ్రీపతి బాపురావు, బట్టారి వెంకటేశ్వర్లు, గుండేటి నాందేవ్,సుమిత్,పోడేటి సంజీవ్,పొలాస సత్యనారాయణ, ధరణికోట వేణుగోపాల్,పత్తి సత్తయ్య, బి ప్రభాకర్, దుర్గ ప్రసాద్, బి రామ్మోహన్, కెవిఎల్ఎన్ మూర్తి,రాజేశ్వర్, ఎండి అజర్, రాసపల్లి రవి, జి రాజగోపాల్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ లు బొడ్డు శ్రావణ్ కుమార్, ఏ సుధాకర్, వైస్ చైర్మన్లు బి మోహన్, జి రాజవేణు, ఓ కృష్ణ, బి మనోజ్, మోతె జయకృష్ణ, సూరినేని గంగాధర్, బన్న రవీందర్, ఎస్ కిషన్, బాలకృష్ణ, ఏ సునీత, ఎన్ గోపాల్, బెజ్జంకి జగన్, ఏ రాజేందర్ రెడ్డి, మోషిన్ అహ్మద్ ,వెంకటరమణ, ఎం రమేష్ ,రాథోడ్ రమేష్, ఫైనాన్స్ కార్యదర్శి అనుముల సతీష్ కుమార్, పబ్లిసిటీ కార్యదర్శి జె రామ్‌ కుమార్, కార్యదర్శులు నడిమెట్ల సత్యనారాయణ, తిరుపతి,మేడి శంకర్, గుండు వెంకటేశం,జి వెంకటస్వామి, కే శ్రీధర్ స్వామి, టీజీవో,టీఎన్జీఓ,  నాయకులు, వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల, కార్మిక సంఘాల ప్రతినిధులు, నాయకులు  పాల్గొన్నారు
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!