ePaper
Wednesday, October 28, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్బంగాళాఖాతంలో 'అర్నబ్' తుపాన్: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు – ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విపత్తుల...

బంగాళాఖాతంలో ‘అర్నబ్’ తుపాన్: రేపు, ఎల్లుండి భారీ వర్షాలు – ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ విజ్ఞప్తి.

📰 Generate e-Paper Clip

తిరుపతి, అర్జున్ సమాచారం:
తూర్పుమధ్య, పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుపాను గడిచిన ఆరు గంటల్లో గంటకు 13 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ఈ తుపాను విశాఖపట్నానికి 540 కి.మీ., కాకినాడకు 620 కి.మీ., మచిలీపట్నానికి 720 కి.మీ., బాపట్లకు 790 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉనట్లు తెలిపింది.
తుపాను తీరానికి దగ్గరవుతున్న కొద్దీ దాని తీవ్రత పెరిగే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మంగళ, బుధవారాల్లో తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్  ప్రఖర్ జైన్ సూచించారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!