హైదరాబాద్, అక్టోబర్ 26,అర్జున్ సమాచారం:
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తన సతీమణి జానకి శుక్లాతో కలిసి సోమవారం న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్ రాష్ట్రపతికి పుష్పగుచ్ఛం అందజేశారు. అనంతరం రాష్ట్రపతితో గవర్నర్ భేటీ అయ్యారు.
=========================

