ePaper
Tuesday, August 18, 2026
ePaper
Homeతెలంగాణవికారాబాద్బొమ్మరాస్ పేట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ పర్యటన

బొమ్మరాస్ పేట్ లో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ పర్యటన

📰 Generate e-Paper Clip

వికారాబాద్,అర్జున్ సమాచారం:
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ కడ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యటించి పనులను పరిశీలించారు.  ఈ సందర్భంగా బొమ్మరాస్ పెట్ పరిధిలో నిర్మిస్తున్న జూనియర్ కళాశాల పనులను జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ తో కలిసిపరిశీలించారు.
పనులు పూర్తి స్థాయిలో నాణ్యతతో చేపట్టాలని ఆయన అధికారులకు సూచించారు.  అధికారులు ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించాలని ఆయన సూచించారు. కళాశాల ప్రాంబోత్సవ సమయంలోపు అన్ని మౌలిక వసతులతో పాటు రోడ్డు పనులు పూర్తి చేయాలని ఆయన సంబంధిత ఇంజనీర్లకు సూచించారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్. శ్రీధర్ కు జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటా చారి,  అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైని) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జడ్పీ సిఇఓ సుధీర్ లు పూల బోకెలతో స్వాగతం పలికారు.
ప్రిన్సిపల్ సెక్రటరీ తో పాటు అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి, అసిస్టెంట్ కలెక్టర్ (ట్రైని) సచిన్ బస్వరాజ్ గుట్టూరు, కడ ప్రత్యేక అధికారి వెంకట్ రెడ్డి, జడ్పీ సిఇఓ సుధీర్, ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!