ePaper
Friday, September 18, 2026
ePaper
Homeసినిమామాయలేడి" మూవీ టీజర్ రిలీజ్

మాయలేడి” మూవీ టీజర్ రిలీజ్

📰 Generate e-Paper Clip

యంగ్ టాలెంటెడ్ హీరో, ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రాకేష్ వర్రే చేస్తున్న కొత్త సినిమా “మాయలేడి”. ఈ సినిమాలో రాకేష్ వర్రే హీరోగా నటిస్తూ క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై  నిర్మిస్తున్నారు. రాకేష్ వర్రే గతంలో క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎవరికీ చెప్పొద్దు, పేకమేడలు వంటి కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ నిర్మించి అందరి ప్రశంసలు పొందారు. ఇప్పుడు “మాయలేడి”తో మరో ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమాను దర్శకుడు ప్రశంకర్ రూపొందిస్తున్నారు. మధుమిత సర్కార్ హీరోయిన్ గా నటిస్తోంది. అక్టోబర్ లో “మాయలేడి” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు మేకర్స్ “మాయలేడి” సినిమా టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఎలా ఉందో చూస్తే – ప్రేమ, పెళ్లి విషయంలో కొన్ని స్పష్టమైన అభిప్రాయాలు ఉన్న అబ్బాయి క్రిష్. ఇంట్లో వాళ్లు పెళ్లి గురించి అడిగితే తనకు కరెక్ట్ అమ్మాయి దొరికేంత వరకు వెయిట్ చేస్తానంటాడు, అన్నిరకాలుగా సెట్ అయితేనే చేసుకుంటాను, అంత క్లారిటీతో ఉన్నానని చెప్తాడు. ఈ ప్రయత్నంలో ఆశా అనే ఫైర్ బ్రాండ్ అమ్మాయిని కలుస్తాడు క్రిష్. ఆమె ఫైట్స్ చేస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటుంది. ఆమెను చూసి కుటుంబ సభ్యులు భయపడినా క్రిష్ ఆశాను లవ్ చేస్తాడు. తప్పు జరిగితే ఆగ్రహంతో ఊగిపోయే ఆశాకు క్రిష్ కు గతంలో రూపా అనే గర్ల్ ఫ్రెండ్ ఉందని తెలుస్తుంది. రూపా గురించి తెలుసుకున్న ఆశా ఏం చేసింది? ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ విషయంలో క్రిష్ తో ఆమె ఎలా డీల్ చేసింది. ఈ విపత్కర పరిస్థితి నుంచి క్రిష్ ఎలా బయటపడ్డాడు ?. రూపాతో అతనికి ఉన్న రిలేషన్ ఏంటి? అనే ట్విస్టులతో మాయలేడి సినిమా టీజర్ ఆద్యంతం ఆసక్తిరేపింది.
ఇటీవల రిలీజ్ చేసిన “మాయలేడి” సినిమా గ్లింప్స్, టైటిల్ సాంగ్, ‘సరిగమలే గుండె అంచుల్లో..’ పాటలకు హ్యూజ్ రెస్పాన్స్ దక్కింది. ఒక ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీని థియేటర్స్ లో చూడబోతున్న ఫీల్ ను ప్రేక్షకుల్లో తాజాగా రిలీజ్ చేసిన టీజర్ క్రియేట్ చేస్తోంది.
నటీనటులు -రాకేష్ వర్రే, మధుమిత సర్కార్, ఇంద్రజ, సురేష్, సత్య, తదితరులు
=========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!