ePaper
Friday, September 18, 2026
ePaper
Homeతెలంగాణపెద్దపల్లిసమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి

సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తా. మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి

📰 Generate e-Paper Clip

కమాన్ పూర్,అర్జున్ సమాచారం:

కమాన్ పూర్ మండలంలోని సమస్యలను జిల్లా కలెక్టర్ కు తీసుకెళ్లడం జరుగుతుందని మండల ప్రత్యేక అధికారి ప్రవీణ్ రెడ్డి అన్నారు. గురువారం ఎంపీడీవో సాదినేని ప్రియాంక అధ్యక్షతన కమాన్ పూర్ మండల స్థాయి సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలువురు సర్పంచులు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించాలని, చాలా గ్రామాల్లో విద్యుత్ లైన్లు లూప్ గా ఉన్నాయని , గొల్లపల్లెలో త్రాగునీటి సమస్య ఉందని, గుండారం పాఠశాలలో ఇంగ్లీష్ ఉపాధ్యాయుని నియమించాలని, సర్పంచులు రంగు సత్యనారాయణ గౌడ్, షీలారపు మల్లయ్య, జంగిలిపోచాలు, గుమ్మడి శ్రీనివాస్, పల్లె మాధవి నారాయణలు ఆయా సమస్యలను సభా దృష్టికి తీసుకువెళ్లారు, అలాగే ఆయా సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని ప్రత్యేక అధికారి తెలిపారు. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ వైనాల రాజు, సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు మాట్లాడుతూ గ్రామాల్లోని సమస్యలను మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేయిస్తామని వారు అన్నారు. అలాగే అధికారులు సైతం గ్రామాల్లో పేర్కొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని వారు సూచించారు. ఈ ఈ సమావేశంలో తహసిల్దార్ ముస్త్యాల వాసంతి వ్యవసాయ అధికారి  గిరి రామకృష్ణ, ఎన్పీడీసీఎల్ సెక్షన్ అధికారి తూర్పాటి స్వామి, పశువైద్యాధికారి మురళీకృష్ణ తోపాటు ఎక్సైజ్ ఎస్సై నాయక్ తదితరులు పాల్గొన్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!