గోదావరిఖని ,అర్జున్ సమాచారం :
భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (SIR) పురోగతిపై రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మంగళవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇంచార్జ్‌లతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రతి ఇంటికి చేరుకుని SIR ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలు నమోదు అయ్యేలా క్షేత్రస్థాయిలో అధికారులు, ఇంచార్జ్‌లు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
SIR ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని, అవసరమైన పత్రాల సేకరణలో ప్రజలకు సహకరించాలని సూచించారు. ప్రతి డివిజన్‌లో, గ్రామాల్లో రోజువారీ పురోగతిని పర్యవేక్షిస్తూ లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో డివిజన్, గ్రామాల ఇంచార్జ్‌లు తమ పరిధిలో జరుగుతున్న SIR కార్యక్రమం పురోగతిని ఎమ్మెల్యేకు వివరించారు.
ఈ సమావేశం నగర మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, కార్పోరేటర్లు, నాయకులు పాల్గొన్నారు.
