ePaper
Thursday, July 9, 2026
ePaper
Homeతెలంగాణరాజన్న సిరిసిల్లరెవెన్యూ అధికారులు సమయ పాలన పాటించాలి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులు...

రెవెన్యూ అధికారులు సమయ పాలన పాటించాలి భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులు పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో తనిఖీ

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల,అర్జున్ సమాచారం:
రెవెన్యూ అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మంగళవారం తనిఖీ చేశారు. అధికారులు, సిబ్బంది హాజరు రిజిస్టర్ పరిశీలించారు. మొత్తం సిబ్బంది ఎందరు ఉన్నారు అని ఆరా తీశారు. కార్యాలయంలో పరిశీలించారు. భూ భారతి, సాదాబైనామా దరఖాస్తులపై ఆరా తీశారు. పలు దరఖాస్తులు పరిశీలించారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అధికారులు, సిబ్బంది విధులకు సమయానికి రావాలని సూచించారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని ఆదేశించారు. భూ భారతి, సాదాబైనామా కింద వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని తెలిపారు. కార్యాలయంలోని అన్ని ఫైళ్లను జాగ్రతగా భద్రపరచాలని, ఆవరణ అంతా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.
పరిశీలనలో ఇంచార్జి తహసీల్దార్ మురళి సిబ్బంది తదితరులు ఉన్నారు.
===========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
error: Content is protected !!