హైదరాబాద్,అర్జున్ సమాచారం:
పోలీసు విధుల్లో బాధ్యతతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ మహిళా కోర్టు కానిస్టేబుల్ దీప.
ఎల్.బి. నగర్ స్పెషల్ పోక్సో కోర్టుకు చంటి బిడ్డతో విచారణకు హాజరైన బాధితురాలు ఇబ్బంది పడకుండా, విచారణ సమయంలో ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకుని తల్లిలా ఆలనా పాలనా చూశారు.
ఖాకీలో మాతృత్వం, మానవీయతను చాటిన దీపను న్యాయవాదులు, పోలీసు సిబ్బంది అభినందించారు.

