కమాన్ పూర్,అర్జున్ సమాచారం:
కమాన్ పూర్ మండల కేంద్రంలో వివిధ వార్డుల్లో గణపతి నవరాతరోత్సవాల్లో భాగంగా నెలకొల్పిన గణనాథుల విగ్రహలను గురువారం కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఇనగంటి రామారావు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా కమాన్ పూర్ లోని కేశవ నగర్, హనుమాన్ నగర్, గోకుల్ నగర్, సుభాష్ నగర్, రాంనగర్, దాసరి పల్లె, ఓల్డ్ అంబేద్కర్ నగర్, న్యూ అంబేద్కర్ నగర్, శ్రీనగర్, కమాన్ పూర్ ఎక్స్ రోడ్ ల్లో అలాగే పలు వార్డుల్లో గల గణనాథులను దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
==========================

