ePaper
Saturday, September 26, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్సఖి కేంద్రం సేవలు మరింత సమర్థవంతంగా అందించాలి జిల్లా న్యాయ సేవా అధికార...

సఖి కేంద్రం సేవలు మరింత సమర్థవంతంగా అందించాలి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి యశ్వంత్ సింగ్

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
మహిళలకు రక్షణ, న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌తో పాటు అవసరమైన సేవలను అందిస్తున్న సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ సేవలను మరింత సమర్థవంతంగా అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి  యశ్వంత్ సింగ్ సూచించారు. శుక్రవారం ప్యానల్ అడ్వకేట్లతో కలిసి కరీంనగర్ సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను సందర్శించిన ఆయన, కేంద్రంలో నమోదవుతున్న కేసులు, బాధితులకు అందుతున్న న్యాయ సహాయం, కౌన్సెలింగ్‌, వైద్య సహాయం, తాత్కాలిక ఆశ్రయం తదితర సేవలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లు, కేసు ఫైళ్లు, రికార్డులను పరిశీలించి, కేసుల పురోగతిపై సమీక్షించారు. షెల్టర్ రూమ్‌, కౌన్సెలింగ్‌ గదులు, పరిసరాలను పరిశీలించి పరిశుభ్రతతో పాటు బాధితులకు సురక్షితమైన, గౌరవప్రదమైన వాతావరణం కల్పించాలని సూచించారు. ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, సఖి కేంద్రం ద్వారా దాఖలయ్యే గృహహింస కేసులను క్రమం తప్పకుండా సమీక్షిస్తూ బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, సంబంధిత శాఖలు, లీగల్ కౌన్సిల్, సఖి సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. బాధితుల గోప్యతను కాపాడుతూ వారి హక్కులు, అందుబాటులో ఉన్న న్యాయ పరిహారాలపై అవగాహన కల్పించాలని సూచించారు. న్యాయ సహాయం అవసరమైన బాధితులు జిల్లా న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ మహేష్ తణుకు, ప్యానల్ అడ్వకేట్లు ఏ. కిరణ్ కుమార్, పెరుక రంగయ్య, సి.హెచ్. చంద్రప్రకాష్ రెడ్డి, సఖి సెంటర్‌ అడ్మినిస్ట్రేటర్‌ దామెర లక్ష్మి, లీగల్‌ కౌన్సిలర్‌ ఎన్. సంధ్యారాణి, సోషల్‌ కౌన్సిలర్‌ రేణుక, కేస్‌ వర్కర్‌ పద్మ, సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!