ePaper
Thursday, October 29, 2026
ePaper
Homeజాతియంఢిల్లీసీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు తదుపరి విచారణ నవంబర్‌ 17కు...

సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌పై పిటిషన్లు.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు తదుపరి విచారణ నవంబర్‌ 17కు వాయిదా ఈసీ అఫిడవిట్‌పై స్పందనకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఫారం-6లో మార్పులపై విచారణలో వాదనలు ‘సర్‌’ నిర్ణయాలు ఏకగ్రీవమని ఈసీ వివరణ ఓటర్ల జాబితా నిర్వహణపై పిటిషన్లలో అభ్యంతరాలు

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం  :       సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ పనితీరును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు భారత ఎన్నికల సంఘానికి (ఈసీ) నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్‌ 17కు వాయిదా వేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, న్యాయమూర్తులు జాయ్‌మాల్య బాగ్చి, వి. మోహనలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించింది. ఎన్నికల సంఘం దాఖలు చేసిన అఫిడవిట్‌పై తమ స్పందన తెలియజేసేందుకు పిటిషనర్లకు రెండు వారాల గడువు ఇచ్చింది. విచారణ సందర్భంగా తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ దోలా సేన్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది మేనకా గురుస్వామి వాదనలు వినిపించారు. కొత్త ఓటర్ల నమోదు కోసం ఉపయోగించే ఫారం-6లో మార్పులకు సంబంధించి ఎన్నికల సంఘం వ్యవహరించిన తీరుపై ఆమె అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫారం-6లో మార్పులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినట్లు ఈసీ పత్రికా ప్రకటనలో పేర్కొందని ఆమె ఆరోపించారు. దీనిపై స్పందించిన ప్రధాన న్యాయమూర్తి.. పరిశీలిస్తామని తెలిపారు. మరోవైపు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)కు సంబంధించిన నిర్ణయాలన్నీ ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఎన్నికల సంఘం తన అఫిడవిట్‌లో పేర్కొంది. ఫారం-6ను మూడు సర్‌ ఉత్తర్వుల ద్వారా మార్చారన్న ఆరోపణను కూడా తోసిపుచ్చింది.
ఎన్నికల సంఘం పనితీరులో పారదర్శకత, ఓటర్ల జాబితా నిర్వహణకు ఉపయోగించే ERONET వ్యవస్థలో అధికారాల కేంద్రీకరణ, ఓటర్ల పేర్ల నమోదు, తొలగింపులపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌ సింగ్‌ సంధు, వివేక్‌ జోషి అభ్యంతరాలను పట్టించుకోకుండా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంటూ గతంలో వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ వివాదం మరింత చర్చనీయాంశమైంది. అయితే, ‘సర్‌’కు సంబంధించిన తుది నిర్ణయాలు ఏకగ్రీవంగానే తీసుకున్నామని ఈసీ స్పష్టం చేసింది.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!