ePaper
Sunday, November 1, 2026
ePaper
Homeతెలంగాణమంచిర్యాలసీసీసీ కార్నర్‌లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ 30 ఏళ్ల ప్రజల కల నెరవేర్చిన...

సీసీసీ కార్నర్‌లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ 30 ఏళ్ల ప్రజల కల నెరవేర్చిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మేయర్ ధరణి మధుకర్ ఆధ్వర్యంలో భూమిపూజ కార్యక్రమం

📰 Generate e-Paper Clip

మంచిర్యాల,అర్జున్ సమాచారం:
సీసీసి కార్నర్ :అక్టోబర్ 30:
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ సీసీసీ కార్నర్ చౌరస్తా వద్ద ప్రయాణికులు, స్థానిక ప్రజలు, వ్యాపారస్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న సులభ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులకు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్ భూమిపూజ నిర్వహించారు. డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, మున్సిపల్ కమిషనర్ జి. అన్వేష్‌తో కలిసి ఆయన భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. సీసీసీ కార్నర్ చౌరస్తా మీదుగా ప్రతిరోజూ వేలాది మంది ప్రయాణిస్తున్నప్పటికీ, ఇక్కడ సులభ్ కాంప్లెక్స్ లేకపోవడంతో ప్రయాణికులు, వ్యాపారస్తులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యను గుర్తించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే కృషితో జిల్లా కలెక్టర్ ద్వారా సింగరేణి సీఎండీ, స్థానిక అధికారులతో చర్చించి, ఇక్కడ ఉన్న హైటెన్షన్ విద్యుత్ టవర్‌ను తొలగించేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు సులభ్ కాంప్లెక్స్ నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. దాదాపు 30 ఏళ్లుగా స్థానిక ప్రజలు, వ్యాపారస్తులు, ప్రయాణికులు ఎదురుచూస్తున్న కల నేడు సాకారమవుతోందని హర్షం వ్యక్తం చేశారు.
ఈ నిర్మాణానికి కృషి చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కలెక్టర్, సింగరేణి సీఎండీ, శ్రీరాంపూర్ జనరల్ మేనేజర్ మునిగంటి శ్రీనివాస్, విద్యుత్ శాఖ అధికారులకు మేయర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాలకవర్గ కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, మున్సిపల్ ఏఈ మధు, కాంగ్రెస్ పార్టీ డివిజన్ ఇన్‌చార్జీలు, నాయకులు, సింగరేణి రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ అనుబంధ సంఘాల ప్రతినిధులు, స్థానిక వర్తక వాణిజ్య సంఘాల నాయకులు, వ్యాపారస్తులు, కార్యకర్తలు, ప్రయాణికులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!