ePaper
Wednesday, August 19, 2026
ePaper
Homeజగిత్యాలస్కూలు, ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్

స్కూలు, ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్

📰 Generate e-Paper Clip

మెట్ పల్లి,అర్జున్ సమాచారం:
మెట్పల్లి పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల భవనం, ప్రభుత్వ వైద్యశాల పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాలతో వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మెరుగైన విద్యా, వైద్య సేవలు అందించేందుకు ఈ భవనాలు ఎంతో ఉపయోగపడతాయని, పనుల్లో ఎలాంటి రాజీ వద్దని, ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. ఈ పరిశీలనలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము, తహసీల్దార్, వైద్య సిబ్బంది, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!