ePaper
Tuesday, November 10, 2026
ePaper
Homeజగిత్యాలఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు,

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు,

📰 Generate e-Paper Clip

ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు,

జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించిన ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్.

జగిత్యాల జిల్లా :అర్జున్ సమాచారం ప్రతినిధి,నవంబర్ 8

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ వేడుకల్లో అధ్యక్షులు గజంగి నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్‌తో పాటు పలువురు చైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అలాగే జిల్లా, మండల స్థాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యవర్గ సభ్యులు, జగిత్యాల నియోజకవర్గ ముఖ్య నాయకులు, పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు హాజరై వేడుకల్లో భాగస్వాములయ్యారు.
పార్టీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో ఉత్సాహభరిత వాతావరణంలో వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!