వికారాబాద్,అర్జున్ సమాచారం:
తాండూరు పట్టణ సమీపం లోని TGRWS స్కూల్ & జూనియర్ కాలేజీ హాస్టల్ నుంచి 10వ తరగతి విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది. ఆ విద్యార్థి ఆచూకీ కోసం హాస్టల్ పీడీ తాండూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో హాస్టల్ లో ఉండి పడవ తరగతి విద్యార్థి అక్షిత్ చదువుకుంటున్నాడు.
ఉదయం సమయంలో హాస్టల్ నుంచి విద్యార్థి బయటకు వెళ్లిపోయాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. విద్యార్థి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఇదిలా ఉండగా, ఇదే హాస్టల్ ఇటీవల మరో వివాదంతో వార్తల్లో నిలిచింది. సీనియర్ విద్యార్థి, జూనియర్ విద్యార్థిపై దాడి చేసి, చపాతీ చేయలేదనే కారణంతో వాతలు పెట్టిన ఘటన ఇటీవల ఇదే నెలలో కలకలం రేపింది. తాజాగా మరో విద్యార్థి హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో హాస్టల్ నిర్వహణ, విద్యార్థుల భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
మరోవైపు హాస్టల్కు ప్రహరీ గోడ లేకపోవడం వల్ల భద్రతాపరమైన లోపాలు ఉన్నాయని పీడీ మీడియాతో పేర్కొన్నారు . విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.
=========================
హాస్టల్ నుంచి విద్యార్థి అదృశ్యం.. ఆందోళనలో తల్లిదండ్రులు
RELATED ARTICLES

