మహాధర్నాకు ఉద్యోగుల సమరభేరి.సమస్యల పరిష్కారం కోసం 27న నస్పూర్లో భారీ ఆందోళన.
అర్జున్ సమాచారం. ఆగస్టు 25. (స్టాఫ్ రిపోర్టర్) మంచిర్యాల జిల్లా.
మంచిర్యాల: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం TGEJAC ఆధ్వర్యంలో ఈ నెల 27న నస్పూర్ IDOC వద్ద నిర్వహించనున్న మహాధర్నాకు ఉద్యోగులు భారీగా తరలిరానున్నారు. సుమారు 3,000 మంది ఉద్యోగులు పాల్గొనేలా సంఘాల నాయకులు సన్నాహాలు చేస్తున్నారు.
TGEJAC మంచిర్యాల జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో మంగళవారం వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైద్య, పోలీస్ శాఖల కార్యాలయాలను సందర్శించి ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించారు. మహాధర్నాలో ప్రతి ఉద్యోగి పాల్గొని తమ డిమాండ్ల సాధన కోసం ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.
PRC అమలు, 6 DAల చెల్లింపు, CPS రద్దు చేసి OPS అమలు, EHSను సంపూర్ణంగా అమలు చేయడం, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో 17 శాతం HRA అమలు, పెండింగ్ ఆర్థిక ప్రయోజనాల విడుదల తదితర డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని TGEJAC నాయకులు కోరుతున్నారు.
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అన్ని సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని గడియారం శ్రీహరి అన్నారు. ఈ సన్నాహక సమావేశాల్లో TGEJAC జిల్లా సెక్రటరీ జనరల్ వనజా రెడ్డి, కో-చైర్మన్ పొన్న మల్లయ్య, డిప్యూటీ చైర్మన్ బొడ్డు శ్రావణ్ కుమార్, వైస్ చైర్మన్ నాగుల గోపాల్, ఫైనాన్షియల్ సెక్రటరీ సతీష్ కుమార్తో పాటు వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

