ePaper
Sunday, October 25, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్02 శంషాబాద్ ఎయిర్పోర్ట్ డి ఆర్ ఐ అధికారులు తనిఖీలు

02 శంషాబాద్ ఎయిర్పోర్ట్ డి ఆర్ ఐ అధికారులు తనిఖీలు

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం :శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది.
మలేషియాలోని కౌలాలంపూర్‌కు అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించిన రూ.1.56 కోట్ల విలువైన విదేశీ కరెన్సీని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక మహిళతో పాటు మరో వ్యక్తిని అరెస్ట్‌ చేశారు.2026 అక్టోబర్‌ 22, 23 తేదీల్లో అందిన పక్కా సమాచారంతో DRI హైదరాబాద్‌ జోనల్‌ యూనిట్‌ అధికారులు శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు చేపట్టారు. అక్టోబర్‌ 22న ఎయిర్‌ఏషియా విమానం AK-68లో హైదరాబాద్‌ నుంచి మలేషియాలోని కౌలాలంపూర్‌కు వెళ్లేందుకు సిద్ధమైన ఓ భారతీయ ప్రయాణికుడిని అధికారులు అడ్డుకున్నారు.
అతని ట్రాలీ బ్యాగులో తనిఖీలు నిర్వహించగా, దుస్తుల మధ్య నల్లటి ప్లాస్టిక్‌ కవర్‌లో దాచిన 66,600 అమెరికన్‌ డాలర్లు, 3,773 మలేషియా రింగిట్లు, 2 సింగపూర్‌ డాలర్లు గుర్తించారు. వీటి మొత్తం విలువ సుమారు రూ.63.62 లక్షలుగా అధికారులు అంచనా వేశారు..

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!