ePaper
Friday, August 14, 2026
ePaper
Homeఎడిటోరియల్దర్శకుడు భాగ్యరాజ్ మృతి

దర్శకుడు భాగ్యరాజ్ మృతి

📰 Generate e-Paper Clip

చెన్నై ,అర్జున్ సమాచారం :
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. తమిళ దర్శకుడు నటుడు భాగ్యరాజ్ (73)  కన్నుమూసారు. గుండెపోటు కారణంగా అయన మరణించారు. చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. అయన నటుడిగా, దర్శకుడిగా,  రైటర్ గా, స్వరకర్తగా, నిర్మాతగా పలు సినిమాలు అందించారు.
తమిళ చిత్ర పరిశ్రమలో బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరుగాంచిన భాగ్యరాజ్ ను  ఇండియన్ సినిమాలో ‘కింగ్ ఆఫ్ స్క్రీన్ ప్లే’ అని పిలుస్తుంటారు . తెలుగులో అల్లరి నరేశ్ నటించిన పెళ్లైంది కానీ’ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయి గారు సినిమాలకు స్క్రిప్ట్ అందించారు. తెలుగులో భాగ్యరాజ్ చివరి చిత్రం శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన కుబేర.
మూడు రోజుల కిందట గోవాలో కుష్బూ కూతురి పెళ్లికి హాజరయిన భాగ్యరాజ్ హఠాన్మరణంతో తమిళ సినీ లోకం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ఎన్నో విజయవంతమైన చిత్రాలను అందించి ప్రేక్షకుల గుండెల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న భాగ్యరాజ్ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. భాగ్యరాజ్ మరణవార్త తెలియగానే కోలీవుడ్తో పాటు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. భాగ్యరాజ్ కు శరణ్య భాగ్యరాజ్ (కుమార్తె), శంతను భాగ్యరాజ్( కుమారుడు) ఉన్నారు. పారిజాతం అనే సినిమాతో శరణ్య, సక్కరకట్టి అనే సినిమాతో శంతను సినీరంగంలో ప్రవేశించారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!