ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeతెలంగాణజిల్లా ప్రత్యేక అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ . జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్,...

జిల్లా ప్రత్యేక అధికారి, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ . జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, జిల్లా అధికారులతో కలిసి సమీక్ష

📰 Generate e-Paper Clip

రాజన్న సిరిసిల్ల ,అర్జున్ సమాచారం :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక తో పాలన ప్రజలకు మరింత చేరువ అయిందని ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ,అటవీ శాస్త్ర సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ తెలిపారు.
మార్చి 6 వ నుంచి జూన్ 12 వరకు 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కింద 10 అంశాలతో వివిధ శాఖల ఆద్వర్యంలో చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు అమలు, భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనపై జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో శనివారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ , పర్యావరణ, అటవీ శాస్త్ర మరియు సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ హాజరుకాగా, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ పుష్పగుచ్చం అందజేసి
స్వాగతం పలికారు.
ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులు ప్రజలకు చేరవేయడం, భవిష్యత్తు ప్రణాళికలు రూపొందించడమే లక్ష్యంగా మార్చి 6నుంచి జూన్ 12 వ వరకు జిల్లాలో చేసిన అభివృధి పనులు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, వివిధ ఫైళ్ల పరిష్కారం, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంపై జిల్లా యంత్రాంగం రూపొందించిన పీపీటీ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తో కలిసి ప్రిన్సిపల్ సెక్రటరీ
పరిశీలించారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక జిల్లా ప్రత్యేక అధికారి, దేవాదాయ శాఖ, పర్యావరణ, అటవీ శాస్త్ర మరియు సాంకేతిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ.
ప్రతి శాఖ భవిష్యత్ కార్యాచరణను స్పష్టంగా నిర్దేశించుకుని, 99 రోజుల కార్యక్రమం ద్వారా సాధించిన విజయాలను డాక్యుమెంటరీ రూపొందించాలని ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లాలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేయడం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి, డీ అడిక్షన్ కౌన్సెలింగ్ కేంద్రం, రోడ్డు భద్రతలో భాగంగా సీపీఆర్ శిక్షణ, అవగాహన కార్యక్రమాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర పనుల్లో పురోగతిపై జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ను ప్రిన్సిపాల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ అభినందించారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీఆర్ఓ జయశ్రీ, సీపీఓ శ్రీనివాసాచారి, జడ్పీ సీఈవో వెంకట మాధవ రావు, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా పశువైద్య అధికారి రవీందర్ రెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఆయా మండలాల ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!