ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్ఆలయాలు భారతీయ సంస్కృతికి నిలయాలు

ఆలయాలు భారతీయ సంస్కృతికి నిలయాలు

📰 Generate e-Paper Clip

రాయచోటి, జూలై 01,అర్జున్ సమాచారం :
ఆలయాలు ప్రజల్లో భక్తి భావం పెంపొందించడమే కాకుండా వారిలో ఆధ్యాత్మికతను పెంచి నవ సమాజ స్థాపనకు జాతీయ సమైక్యతకు ప్రతిరూపంగా నిలవాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డి కోరారు .బుధవారం అన్నమయ్య జిల్లాలోని సంబేపల్లిలోని పశుపతి నాథ ఆలయ విగ్రహ ప్రతిష్ఠోత్సవ కార్యక్రమంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూరాయచోటి నియోజకవర్గంలోని సంబేపల్లి మండలం, సంబేపల్లి గ్రామంలో వెలసిన శ్రీ గుహేశ్వరి సమేత పశుపతినాథ స్వామి దేవస్థానం పునఃనిర్మాణం మరియు నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో రాష్ట్ర రవాణా, క్రీడాశాఖ మంత్రివర్యులు  మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందిన మంత్రి , ఆలయాలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు చిహ్నాలని, ఆధ్యాత్మిక విలువల పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. అనంతరం ఆలయ అభివృద్ధికి కృషి చేస్తున్న కమిటీ సభ్యులను అభినందించి, భక్తులతో ఆప్యాయంగా మమేకమయ్యారు. గ్రామస్తులు, భక్తులు మంత్రివర్యులకు ఘన స్వాగతం పలికి సన్మానించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల నాయకులు గ్రామ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారురాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం, హసనాపురం గ్రామ పంచాయతీ పరిధిలోని గొల్లపల్లిలో ఇరుగులమ్మ జాతర సందర్భంగా హరినాథ్ రెడ్డి ఏర్పాటు చేసిన విందు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గ్రామ పెద్దలు, ప్రజలు, భక్తులను ఆప్యాయంగా పలకరించి వారితో కలిసి విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామ సంప్రదాయాలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు ప్రజల మధ్య ఐక్యతను, ఆత్మీయతను మరింత బలోపేతం చేస్తాయని మంత్రి  పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.రాయచోటి నియోజకవర్గంలోని రామాపురం మండలం, చిట్లూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పాలన్నగారిపల్లిలో వెలసిన శ్రీ గంగమ్మ దేవత ఆలయం పునఃనిర్మాణానికి రూ.32 లక్షల సీఎజీఎఫ్  నిధులతో చేపట్టనున్న ఆలయ నిర్మాణ పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  భూమిపూజ నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి  ప్రత్యేక పూజల్లో పాల్గొని ఆలయ నిర్మాణ పనులు విజయవంతంగా పూర్తికావాలని ఆకాంక్షించారు. ఆధ్యాత్మిక క్షేత్రాల అభివృద్ధి గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మంత్రికు ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు
=====================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!