ePaper
Sunday, August 16, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు ...

టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు హస్తకళల పరిరక్షణ… కూటమి ప్రభుత్వం బాధ్యత

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం:
కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు
ప్రతి కళాకారుడికీ గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు
ప్రతి కళాకృతిపై క్యూఆర్ కోడ్ వేసి కళాకారుడి వివరాలు పొందుపరుస్తాం
హస్త కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి తెలియజేస్తాం
వీబీ జీ రాం జీ పథకం కింద కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన  పవన్ కళ్యాణ్
స్టాల్స్ సందర్శిస్తూ.. కళాకారులకు భరోసా ఇచ్చిన ఉపముఖ్యమంత్రి
అన్నా కొణిదల గారి కోసం ఉప్పాడ చీరలు కొనుగోలు చేసిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు

ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటక అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్  స్పష్టం చేశారు. కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడికి ఆ గుర్తింపు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. కళాకారుల కష్టాన్ని ప్రపంచానికి పరిచయం చేసే విధంగా ప్రత్యేక డాక్యుమెంటరీలు రూపొందించాలని అధికారులకి దిశానిర్దేశం చేశారు. విబి జీ రాం జీ పథకం కింద క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హస్తకళల పరిరక్షణకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. హస్తకళాకారుల ఆరోగ్య పరిరక్షణకు క్లస్టర్ల వారీగా నిరంతరం వైద్య శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) ఏర్పాటు చేసిన ‘ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవం 2026’ను పవన్ కళ్యాణ్  ప్రారంభించారు. మంగళవారం విజయవాడలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కళా వేదికలో ఏర్పాటు చేసిన ఈ మహోత్సవంలో రాష్ట్ర నలుమూలల నుంచి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ హస్త కళాకారులు ఉత్పత్తి చేసిన కళా రూపాలను ప్రదర్శనకు ఉంచారు. ఈ సందర్భంగా తోలుబొమ్మలాట కళాకారులు ప్రదర్శించిన రామాయణంలోని రావణ సంహార ఘట్టాన్ని తిలకించారు. సతీమణి  అన్నా కొణిదల  కోసం ఉప్పాడ జాందానీ చీరలు కొనుగోలు చేశారు. ప్రతి స్టాల్ ను సందర్శిస్తూ, హస్తకళా ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ కళాకారులకు తనవంతు ప్రోత్సాహం అందించారు. కళాకారులతో మమేకమవుతూ, వారి నైపుణ్యాన్ని అభినందించారు. కళాకారుల సాధకబాధకాలు అడిగి తెలుసుకున్నారు. వారికి అవసరమైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. కళాకారుల కోరిక మేరకు క్లస్టర్ల వారీగా గ్రూపు ఫోటోలు దిగారు. మన రాష్ట్రానికే సొంతమైన హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.
======================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!