ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్'వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం'

‘వరుణ యాగ ప్రత్యేక పూజలు ప్రారంభం’

📰 Generate e-Paper Clip

ఇంద్రకీలాద్రి,అర్జున్ సమాచారం:

రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులను నివారించి, సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు నిండి రైతాంగం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో
దేవాదాయ శాఖ కమీషనర్  వారి ఉత్తర్వులు మేరకు ఈరోజు ఉదయం దేవస్థానంలో దీక్షాపూర్వకంగా వరుణ యాగం సంబందించిన పూజలు ప్రారంభం అయ్యాయి.

ఈరోజు అనగా 14.08.2026 (శుక్రవారం)
ఉదయం 06:15 నుండి శ్రీ దుర్గాస్నానఘాట్లో విఘ్నేశ్వర పూజతో వరుణ యాగ పూజా కార్యక్రమములు ప్రారంభం కాగా ప్రత్యేక పూజల్లో ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ )ఈవో వికె శీనా నాయక్ పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పండితులు వరుణ అనువాక సహిత కారక పారాయణలు నిర్వహించారు. ఈ పారాయణలు కొరకు పండితుల బృందం పవిత్ర కృష్ణానదిలో నడుంలోతు నీళ్లలో ఉండి సకాలంలో వర్షాలు పడాలని పారాయణం చేసారు.

================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!