ePaper
Thursday, August 13, 2026
ePaper
Homeఆంధ్రప్రదేశ్విశాఖపట్నంకాన్వెంట్ కూడలి బ్రిడ్జికి బీటలు.. అధికారులు అప్రమత్తం

కాన్వెంట్ కూడలి బ్రిడ్జికి బీటలు.. అధికారులు అప్రమత్తం

📰 Generate e-Paper Clip

విశాఖపట్నం,అర్జున్ సమాచారం: 
విశాఖ షీలానగర్ నుంచి కాన్వెంట్ జంక్షన్ మీదుగా నగరంలోకి వెళ్లే ప్రధానమార్గం పోర్టు రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. కాన్వెంట్ కూడలికి సమీపంలో ఉన్న  బ్రిడ్జి ఎన్నో ఏళ్ల కిందట నిర్మించినది కావడంతో నడకమార్గం కొంత మేర గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా కూలిపోయి కిందనున్న రైల్వే ట్రాక్ పై శిథిలాలు పడ్డాయి. ఆసమయంలో కింద ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదం కారణంగా విశాఖ పోర్టు నుంచి ఐరన్ ఓర్, కోల్ తీసుకువెళ్లే గూడ్స్ వ్యాగన్ రవాణాకు అంతరాయం ఏర్పడింది. నిత్యం పోర్టు రోడ్డులో భారీ వాహనాలు ప్రయాణిస్తూ ఉంటాయి.  కొంతమంది ఆ మార్గం మీదుగా నడుస్తూ ఉంటారు.. అలా నడిచే సమయంలో నడకదారి కూలిపోయి ఉంటే కొందరి ప్రాణాలు బలైపోయేవి. సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ట్రాక్ క్లియర్ చేయగా, పోర్టు సిబ్బంది బ్రిడ్జిపైన ఎవరు అందరిలో నడకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇప్పటికైనా పోర్టు అధికారులు స్పందించి ఆ మార్గంలో భారీ వాహనాలు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!