ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా

కార్మికుల సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా

📰 Generate e-Paper Clip

కరీంనగర్ జూలై 13,అర్జున్ సమాచారం:
కరీంనగర్‌లో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో వేలాది మంది కార్మికులు తెలంగాణ చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పాల్గొని కార్మికులకు సంఘీభావం తెలిపారు. కార్మికులకు ఈఎస్ఐ ఆసుపత్రి, కార్మిక భవనం, ఇందిరమ్మ ఇళ్లు, ‘కార్మిక బంధు’ పథకం, ఆసరా పెన్షన్, స్థానికులకు ఉపాధి రక్షణ వంటి డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని వారు కోరారు. కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు తమ పూర్తి మద్దతు కొనసాగుతుందని హామీ ఇచ్చారు.
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!