ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeస్పోర్ట్స్చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026 లో మహిళల...

చైనాలోని ఒర్డోస్‌లో జరుగుతున్న తొలి ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 2026 లో మహిళల 4×400 రిలే పరుగుపందెంలో స్వర్ణ పతకం సాధించిన ప్రవల్లిక నరిమళ్లకు అభినందనలు తెలిపారు.

📰 Generate e-Paper Clip

అర్జున్ సమాచారం: తెలంగాణ బిడ్డ ప్రవల్లిక నరిమళ్ల ఆసియా U23 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్స్‌లో అసమాన ప్రతిభ కనబరిచి మహిళల 4×400 మీటర్ల రిలేలో ఆమె స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నారు.
నల్గొండలోని ఎస్సీ గురుకుల డిగ్రీ కాలేజీలో చదువుతూ, డిండి గురుకుల స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొంది అంతర్జాతీయ వేదికపై రాణించిన ప్రవల్లిక యువ క్రీడాకారులు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని ప్రశంసించారు. తాపీ మేస్త్రీ కూతురైన ప్రవల్లిక పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీలేదని నిరూపించారని పేర్కొన్నారు.

ఏషియా అండర్ 23 అథ్లెటిక్ చాంపియన్‌షిప్ 4×400 మీటర్ల రిలే జట్టులో ప్రవల్లిక, శ్రావణి సచిన్ సాంగ్లే, సాంద్రమోల్ సాబు, నోఫిసా ఖతూన్‌లతో కలిసి స్వర్ణ పతకం సాధించారు. ఈ నలుగురు సభ్యుల బృందం 3:33.62 సెకన్ల సమయంతో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుని, ఆతిథ్య దేశమైన చైనాను అధిగమించింది. అంతర్జాతీయ స్థాయికి చేరుకోవడానికి ముందే, ప్రవల్లిక వివిధ వేదికల్లో 23 స్వర్ణాలతో సహా మొత్తం 35 రాష్ట్ర స్థాయి పతకాలను సాధించి అద్భుతమైన దేశీయ రికార్డును నెలకొల్పారు. ప్రవల్లికకు శిక్షణ అందించిన కోచ్‌లకు ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. ఈ చాంపియన్‌షిప్‌లో మొత్తంగా 3 స్వర్ణ, 4 రజత, 9 కాంస్య పతకాలతో సహా 16 పతకాలను సాధించిన భారత క్రీడాకారులందరికీ ముఖ్యమంత్రి  అభినందనలు తెలిపారు
==========================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!