ePaper
Saturday, August 15, 2026
ePaper
Homeతెలంగాణహైదరాబాద్బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి మంత్రి పొన్నం ప్రభాకర్

బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరచాలి మంత్రి పొన్నం ప్రభాకర్

📰 Generate e-Paper Clip

హైదరాబాద్,అర్జున్ సమాచారం:
హైదరాబాద్ జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని  బోరబండ వినాయకనగర్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు  ఈకార్యక్రమంలో  ఎమ్మెల్యే నవీన్ యాదవ్ జీహెచ్ ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ ప్రియాంకా అలా, డిఎంహెచ్ వో శ్రీనివాస్ మెడికల్ ఆఫీసర్ డా,, ప్రియాంక తదితరులు పాల్గోన్నారు.  ముందుగా మంత్రి  బస్తీ దవాఖాన పరిశీలించారు. రోగులకు అందుతున్న చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
బస్తీ దవాఖాన లో ప్రతి రోజు 100-150 ఓపీ వస్తుందని మంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు.. దవాఖాన లో ఓపీ సంఖ్య పెంచాలని రోగుల పట్ల దయనీయంగా వ్యవహరించాలని సూచించారు. స్వయంగా షుగర్ టెస్ట్ , బ్లడ్ టెస్ట్ ,బీపీ టెస్ట్ చేసుకున్నారు. .బస్తీ దవాఖాన లో రోగులకు అవసరమైన అన్ని రకాల పరీక్షలు లేదు అనకుండా చేయాలని అధికారులను ఆదేశించారు.
బస్తీ దవాఖాన లో చికిత్స సౌకర్యాలు మెరుగుపరిచి ప్రజల్లో నమ్మకం కలిగించే  హైదరాబాద్ లో ఉన్న  169 బస్తీ దవాఖాన లకు ప్రత్యేక అధికారులను నియమించామని వారు బస్తీ దవాఖాన లో విజిట్ చేసి రోగుల కు అందుతున్న చికిత్స ,హాస్పిటల్ మౌలిక సదుపాయాలు, ఓపీ సంఖ్య పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఒక నివేదిక అందించాలని ఆదేశించారు.
హైదరాబాద్ బస్తీ దవాఖాన లు రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండేలా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వద్ద అవసరమైన చర్యలు తీసుకునేలా ఈ కార్యక్రమం చేపట్టారు.
===================

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!