పెద్దపల్లి,అర్జున్ సమాచారం:
పెద్దపల్లి మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ కల్లెపల్లి సతీష్ కుమార్ రూ.2 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ నేపధ్యంలో ఈఏ ఇంట్లో రూ.32.31 లక్షల అక్రమ నగదు స్వాధీనం చేసుకున్నారు. మున్సిపాలిటీ అసిస్టెంట్ ఇంజనీర్ కల్లేపల్లి సతీష్ కుమార్ను కాంట్రాక్టర్ బిల్లు ప్రాసెస్ చేసి టీయూఎఫ్ఐడీసీకి పంపేందుకు రూ.2 లక్షల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తుండగా కరీంనగర్ ఏసీబీ అధికారులు పట్టుకున్నారు…నిందితుడి వద్ద నుంచి లంచం నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇంటి సోదాల్లో రూ.32.31 లక్షల లెక్కల్లో చూపని నగదును కూడా స్వాధీనం చేసుకున్నారు.. నిందితుడిని అరెస్ట్ చేసి ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచారు.
=========================
లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయిన మునిసిపల్ ఏఈ
RELATED ARTICLES

