ఆళ్లగడ్డ,అర్జున్ సమాచారం:
పట్టణంలోని పాత బస్టాండ్ ప్రాంతంలో సమీర్ అనే వ్యక్తి పై కత్తితో దాడి చేసిన నలుగురు యువకులను అరెస్టు చేసినట్లు డిఎస్పి శ్రీనివాసరావు తెలిపారు శుక్రవారం ఆళ్లగడ్డ పట్టణ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడిస్తూ ఈనెల 14వ తేదీ రాత్రి 9:30 గంటల సమయంలో సమీర్ అనే వ్యక్తిపై నలుగురు వ్యక్తులు కత్తులతో దాడి చేసి పరారయ్యారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టడం జరిగింది ఆళ్లగడ్డ పట్టణ శివారులోని జాతీయ రహదారిపై ఉన్న ఏవీ గోడౌన్ దగ్గర దోష హౌస్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న నిందితులను పట్టణ సీఐ నాగరాజారావు ఎస్సై చిన్న వీరయ్య మరియు సిబ్బంది వారందరినీ అదుపులోకి తీసుకున్నారన్నారు పోలీసుల విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారని అరెస్టు అయిన వారిలో మునగాల పెద్ద ఏల్లాలు కురుబ వెంకట సుధీర్ తలారి నరేంద్ర మరియు దూదేకుల హుస్సేన్ బాబు ఉన్నారని నిందితుల దగ్గర నుండి రెండు మోటార్ బైకులు ఒక కత్తి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు ప్రేమ వ్యవహారమే ఈ దాడికి ప్రాథమిక కారణంగా గుర్తించినట్టు డిఎస్పి శ్రీనివాసరావు పేర్కొన్నారు నిందితులను కోర్టులో హాజరు పరచునున్నట్లు ఆయన వెల్లడించారు.
ప్రేమ వ్యవహారమే కారణం కత్తితో దాడి చేసిన యువకుల అరెస్టు
RELATED ARTICLES

