ePaper
Friday, August 14, 2026
ePaper
Homeతెలంగాణకరీంనగర్వేగవంతంగా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

వేగవంతంగా ఫోర్‌లైన్ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

📰 Generate e-Paper Clip

కరీంనగర్,అర్జున్ సమాచారం:
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు ఫోర్‌లైన్ రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.
శుక్రవారం తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి, చిగురుమామిడి మండల కేంద్రం, ముల్కనూరు గ్రామాల్లో కలెక్టర్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఫోర్‌లైన్ రహదారికి సంబంధించిన భూసర్వే, అలైన్‌మెంట్ పనులను పరిశీలించారు. ఫేజ్-1 కింద కొత్తపల్లి నుంచి సుందరగిరి వరకు చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. రోడ్డు నిర్మాణంలో భాగంగా ఎక్కడైనా నివాస గృహాలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందా, ప్రత్యామ్నాయంగా బైపాస్ మార్గాల ఏర్పాటు సాధ్యమా అనే అంశాలపై సమగ్రంగా అధ్యయనం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అవసరమైతే గ్రామసభలు నిర్వహించి స్థానిక ప్రజల అభిప్రాయాలు సేకరించి, అందుకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రహదారి పనులు చేపట్టాలని, భూసర్వే పనులను త్వరితగతిన పూర్తి చేసి నిర్మాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు ఆదేశించారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ప్రజల ఇళ్లకు, జీవన విధానానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి, ఆర్డీఓ షర్మిల, తిమ్మాపూర్, చిగురుమామిడి తహసీల్దార్లు శ్రీనివాస్ రెడ్డి, కనకయ్య, ఆర్ అండ్ బి డీఈ కిరణ్, ఏఈ సురేష్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

- Advertisment -
App Icon

Install AS News App

Add to home screen for faster loading and latest updates.

error: Content is protected !!